తనతో గడపాలని ఉంది.. తమన్నాతో డేటింగ్‌ పై విజయ్ వర్మ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా- విజయ్ వర్మ ఎఫైర్ పై ఏడాది కాలంగా పుకార్లు వస్తున్నాయి.

Update: 2024-03-24 15:30 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా- విజయ్ వర్మ ఎఫైర్ పై ఏడాది కాలంగా పుకార్లు వస్తున్నాయి. 2023 న్యూ ఇయర్ వేడుకలు వీరిద్దరూ కలిసి జరుపుకున్నారు. అప్పటి నుండి తరచుగా కలిసి కనిపిస్తుండటం తో ఈ ఎఫైర్ రూమర్స్ మరింత పుంజుకున్నాయి. అయితే ఈ వార్తలను తమన్న ఖండిస్తూ పలు మార్లు ‘తాను ఎవరినీ ప్రేమించడం లేదని’ కథనాలను కొట్టిపారేసింది.. కానీ గత ఏడాది చివర్లో తమన్నా-విజయ్ వర్మ తమ బంధం బహిర్గతం చేశారు. అవును మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అని స్పష్టత ఇచ్చారు. ఇక ఓపెన్ అయ్యాక విరామం దొరికితే రొమాంటిక్ టూర్స్‌ ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే తాజాగా విజయ్ వర్మ, తమన్నాతో డేటింగ్‌‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘నేను తమన్నాతో డేటింగ్‌ ఎప్పుడు ప్రారంభించానో చాలామంది అడుగుతున్నారు. ‘లస్ట్ స్టోరీస్‌-2’ షూటింగ్‌లో అని అందరూ అనుకుంటున్నారు. నిజానికి తమన్నా, నేను డేటింగ్‌ ప్రారంభించింది ‘లస్ట్ స్టోరీస్‌-2’ షూటింగ్‌లోకాదు. షూటింగ్ తర్వాత, ఆ టీమ్‌తో కలిసి ర్యాప్ పార్టీ చేసుకున్నాం. ఆ రోజే తమన్నాకు నా లవ్ గురించి చెప్పాను. ఐతే, నేను తమన్నాతో చెప్పిన మాట.. ‘‘మీతో నేను ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నా’’ అని ఆమెతో చెప్పాను. ఆ తర్వాతే నేను తమన్నాతో డేటింగ్‌ ప్రారంభించాను’ అని చెప్పాడు. మొత్తానికి మొదటి సారిగా వారి రిలెషన్ గురించి ఓపెన్ అయ్యారు వర్మ.


Similar News