రాను రాను.. నేను కూడా దానికి అలవాటు పడ్డానంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన Vijay Varma

విజయ్‌ వర్మ లవ్‌స్టోరీ గురించి పలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

Update: 2023-08-20 03:15 GMT

 దిశ,వెబ్ డెస్క్: ప్రస్తుతం నెట్టింట తమన్నా, నటుడు విజయ్‌ వర్మ లవ్‌స్టోరీ గురించి పలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ రీల్ కపుల్ రియల్ కపుల్ లా ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదండోయ్ ఇద్దరు గాఢ ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇప్పటి వరకు పలు ఇంటర్వ్యూల్లో తమ ప్రేమ గురించి చెబుతూనే వున్నారు. తాజాగా విజయ్‌ వర్మ మరోసారి ఈ విషయంపై మాట్లాడుతూ 'మా ప్రేమ గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. మేమిద్దరం ప్రేమలో పడిన కొత్తలో బయటికి వెళ్లినప్పుడు అందరి దృష్టి మా మీద పడటం, వ్యక్తిగత జీవితం గురించి అందరూ డిస్కషన్‌ చేస్తుంటే.. చాలా ఇబ్బందిగా ఫీలయ్యా. వారు మా పై అంత శ్రద్ధ చూపిస్తున్నందుకు.. నేను కూడా దానికి అలవాటుపడ్డాను. ఏది ఏమైనా తమన్నాతో నేను పీకల్లోతు ప్రేమలో మాత్రం వున్నాను' అని విజయ్‌ చెప్పుకొచ్చారు. 

Also Read: ఈ వారం OTT లో విడుదలయ్యే తెలుగు, హిందీ సినిమాలు ఇవే..

Tags:    

Similar News