Samantha-Naga Chaitanya లకు.. రెండు మూడు పెళ్లిళ్లు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి క్రమంలోనే వారు కొద్ది రోజుల్లో విడిపోతారని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
సామ్-చై నిజంగానే విడాకులు తీసుకుని విడిపోవడంతో ఆయన చెప్పిన మాటలపై అందరికీ నమ్మకం ఏర్పడింది. వీరు అధికారికంగా విడిపోతున్నామని చెప్పినప్పటికీ కారణం ఏంటో చెప్పలేదు. దీంతో అప్పటి నుంచి వీరి విడాకులకు సంబంధించిన పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
తాజాగా, సమంత- నాగచైతన్య విడాకులపై వేణు స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘సమంత, నాగ చైతన్య విడిపోవడానికి అసలు కారణం గ్రహాలు అనుకూలించక పోవడమే. వీళ్లిద్దరి జాతకంలో శని ఉచ్ఛ స్థితిలో ఉంది. అందుకే వాళ్ళు కలిసి ఉండలేరు అని ముందే చెప్పాను. ఇలా ఉన్న జాతకస్తులకు రెండు, మూడు పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంటుందని అన్నారు.
అలాగే శని ఉచ్ఛ స్థితిలో ఉండే జాతకస్తుల్లో విభేదాలు ఏ రకంగా అయినా రావొచ్చు. గతంలో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ మధ్య ఇగో వల్ల మనస్పర్థలు వచ్చాయి. ఆమెకు ఎక్కువ ఫేమ్ ఉండడం అతను తట్టుకోలేకపోయాడు. కానీ, ఐశ్వర్యను సినిమాలకు దూరంగా ఉంచడంతో పాటు కొన్ని పరిహార పూజలు చేయడంతో తేరుకున్నారు. అప్పుడు బాలీవుడ్ జంట ఐశ్వర్యరాయ్-అభిషేక్ మధ్య విభేదాలు వచ్చినట్టే సమంత-నాగచైతన్యలకు కూడా ఇగో వల్ల మనస్పర్థలు వచ్చాయి’’ అంటూ చెప్పుకొచ్చాడు.
Read more :
ప్రశాంతత కోసం యోగా సెంటర్లో జాయిన్ అయిన Samantha ..! హ్యాపీ ప్లేస్ అంటూ పోస్ట్
ఆ హోటల్లోనే పరిణీతి-రాఘవ్ల రిసెప్షన్.. ఎన్ని రకాల వంటకాలో తెలుసా?