‘#VD12’.. ఘనంగా ప్రారంభమైన విజయ్ దేవరకొండ కొత్త చిత్రం

విజయ్ దేవరకొండ ‘#VD12’ బుధవారం రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా ప్రారంభమైంది.

Update: 2023-05-03 11:17 GMT

దిశ, సినిమా: విజయ్ దేవరకొండ ‘#VD12’ బుధవారం రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఎస్.రాధాకృష్ణ (చినబాబు) తన చేతుల మీదుగా స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేశారు. ముహూర్తపు షాట్‌కు ప్రగతి ప్రింటర్స్ ఎండీ శ్రీ పరుచూరి మహేంద్ర కెమెరా స్విచాన్ చేయగా, హానరరీ కౌన్సిల్ జనరల్ ఆఫ్ సౌత్ కొరియా శ్రీ చుక్కపల్లి సురేష్ క్లాప్ కొట్టారు. ఇక గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ఎస్.నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న మూవీని అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా చిత్ర బృందం తెలిపింది. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు.

Tags:    

Similar News