ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు.. రెండేళ్లు టైమ్ వేస్ట్: Varun Tej
మెగా హీరో వరుణ్ తేజ్ తన కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫ్లాప్‌లలో ‘గని’ టాప్ ప్లేస్‌లో ఉంటుందంటున్నాడు.
దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్ తన కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫ్లాప్‌లలో ‘గని’ టాప్ ప్లేస్‌లో ఉంటుందంటున్నాడు. అంతేకాదు ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని తాను ముందే ఊహించానంటూ తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశాడు. గతేడాది రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ‘ఈ మూవీకోసం ప్రత్యేకంగా బాక్సింగ్ శిక్షణ తీసుకుని రెండేళ్లు ఒళ్లు హూనం చేసుకున్నప్పటికీ ఫెయిల్యూర్ బాధించింది. అయితే ఈ సినిమా నా మొదటి ఫ్లాప్ కాదు. ఇంతకుముందు కూడా కొన్ని పరాజయాలు ఎదురయ్యాయి. ‘మిస్టర్’ ఫ్లాప్ అయ్యాక తప్పు ఎక్కడ జరిగిందో విశ్లేషించుకుని సెట్ చేసుకున్నా. ఆ తర్వాత ‘ఫిదా’, ‘తొలి ప్రేమ’ మంచి బూస్ట్ ఇచ్చాయి. కానీ ఈ స్పోర్స్ డ్రామా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించాలని ఓ కమర్షియల్ సినిమాగా రూపొందించడమే బెడిసి కొట్టింది. ఫస్ట్ కాపీ చూసుకున్నపుడే ఫ్లాప్ అవుతుందని ఫిక్స్ అయ్యాం. కానీ అద్భుతం జరుగుతుందేమోననే చిన్న ఆశతో రిలీజ్ చేశాం’ అంటూ చెప్పుకొచ్చాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు బాబీ ఈ సినిమాను నిర్మించాడు.