రెండు గుండెలు ఒక ప్రేమ.. వరుణ్ తేజ్-లావణ్య ‘ఇన్విటేషన్ కార్డ్’ ఫొటో వైరల్
దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమాయణానికి ఫుల్స్టాప్ పడింది. గత కొన్నిరోజులుగా వీరి ఎంగేజ్మెంట్ అంటూ వస్తున్న పుకార్లకు చెక్ పడింది. రూమర్లుగా ఉన్న ఈ వార్తను నిజం చేస్తూ మెగా కుటుంబం గురువారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. జూన్ 9న (రేపు) వీరి ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. దీంతో నిశ్చితార్థానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ‘టూ హార్ట్స్ వన్ లవ్’..ఇద్దరు జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంటూ ఓ ఇన్విటేషన్ కార్డును సినీ వర్గాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాయి. విషయం తెలిసిన అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కేవలం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ జరగనుందని సమాచారం. అయితే, ఎంగేజ్మెంట్ ఎక్కడ, ఏ సమయంలో జరగనుందనే వివరాలను మాత్రం ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ ప్రేమ జంట ఇటలీలో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.