వారికి పెళ్లై, ప్రెగ్నెన్సీ వచ్చేస్తోంది.. కానీ నాకు మాత్రం అంటూ స్టార్ నటి షాకింగ్ కామెంట్స్

‘ఢీ’ షోతో మంచి గుర్తింపు సంపాదించుకుంది యాంకర్ వర్షిణి.

Update: 2024-02-25 14:40 GMT

దిశ, సినిమా: ‘ఢీ’ షోతో మంచి గుర్తింపు సంపాదించుకుంది యాంకర్ వర్షిణి. ఈ భామ తరచూ హాట్ ఫొటో షూట్లతో మతిపోగోట్టే పరువాలతో యువతకు నిద్రలేకుండా చేస్తుంటుంది. ఇటు బుల్లితెరపై పలు షోల్లో అలరిస్తూనే మరోవైపు మూవీల్లో అవకాశాలు దక్కించుకుంటుంది. ఇప్పటికే కొన్ని చిత్రాల్లో వర్షిణి సపోర్టింగ్స్ రోల్స్‌లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. కొన్నాళ్లుగా ఈ ముద్దగుమ్మకు వెండి తెరపై మంచి ఆఫర్లు రావడంతో బుల్లితెరపై ఎక్కువగా కనిపించడం లేదని సమాచారం.

ఇకపోతే తాజాగా వర్షిణి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ఇంట్లో తన అమ్మతో దిగిన ఫొటోలు షేర్ చేస్తూ.. ‘ప్రస్తుతం నా ఏజ్ విచిత్రంగా మారింది. కొందరు పెళ్లి చేసుకుంటున్నారు. కొందరికి ప్రెగ్నెన్నీ కూడా వస్తోంది. అయినా నేను ఇంకా ఇంట్లో కనీసం బయటికి వెళ్లాలన్నా అనుమతి తీసుకునే పరిస్థితే ఉంది’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూసిన జనాలు ఇంతకీ మీ సమస్య ఏంటి మేడమ్ అంటూ సెటైరికల్ గా కామెంట్లు పెడుతున్నారు.


Similar News