వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంట మొదలైన పెళ్లి సంబరాలు.. తలైవాకు వెడ్డింగ్ కార్డ్
నటి వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె శింబు నటించిన ‘బోడ బోడి’ మూవీతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైంది.
దిశ, సినిమా: నటి వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె శింబు నటించిన ‘బోడ బోడి’ మూవీతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైంది. ఇక తెలుగులో తెనాలి రామకృ బీఎ.బిఎల్, క్రాక్, నాంది, యశోధ వంటి పలు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక అనిల్ కాట్జ్ దర్శకత్వంలో తెరకెక్కిన శబరి మూవీలో వరలక్ష్మీ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా ఈ నటి మార్చి 2న వ్యాపార వేత్త నికోలయ్ సచ్ దేవ్‌ను ముంబైలో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరి వివాహం జూలైలో థాయిలాండ్‌లో ఘనంగా బంధువులందరి మధ్య జరగనుందని సమాచారం. ప్రస్తుతం ఈ నటి ఇంట పెళ్లి పనులు షురూ అయ్యాయి.
దీనిలో భాగంగా పెళ్లి పత్రికల పంపిణీ మొదలైంది. గురువారం (జూన్ 6న) రజనీకాంత్‌ను కుటుంబసమేతంగా కలిసి తన పెళ్లికి రమ్మని ఆహ్వానించింది. ఈ మేరకు రజనీకాంత్‌తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తలైవా సర్‌ను, లతా ఆంటీని కలిసి పెళ్లికి ఆహ్వానించాను. నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నందుకు థాంక్యూ సర్. ఐశ్వర్య రజనీకాంత్.. నువ్వెప్పటిలాగే ఎంతో ప్రేమగా మాట్లాడావు అని రాసుకొచ్చింది. కాగా ఆ ఫోటోలో రజనీకాంత్ దంపతులతో పాటు వరలక్ష్మి తల్లిదండ్రులు రాధిక- శరత్‌కుమార్ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.