పాకెట్ మనీ కోసం రాత్రుళ్లు ఆ తప్పు చేసేదాన్ని.. వీడియోలు కూడా.. పూర్తిగా ఓపెన్ అయిన యంగ్ హీరోయిన్

సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది హీరోయిన్ వైష్ణవి చైతన్య.

Update: 2024-03-10 15:16 GMT

దిశ, సినిమా: సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది హీరోయిన్ వైష్ణవి చైతన్య. మొదటి సినిమాతోనే ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ సెలబ్రిటీల చేత ప్రశంసలు అందుకుంది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి.. వైష్ణవి చైతన్యను జయసుధ తో పోల్చి, అంతటి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటావంటూ పొగడ్తల వర్షం కురిపించాడు.

దీంతో ఈ భామ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. బేబీ సినిమా వైష్ణవి కెరీర్ నే మలుపు తిప్పందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ హీరోయిన్ మూడు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని నెట్టింట టాక్ వినిపిస్తుంది. ఇకపోతే ఈమె రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూకు హాజరై తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చింది. ‘‘నేను 10 వ తరగతి చదువుతున్నప్పటి నుంచే ఫ్యామిలీ బాధ్యతలు తీసుకున్నానని, పూట గడవడం కోసం అప్పుడు బర్త్ డే లకు, పెళ్లిళ్ల ఈవెంట్లకు రాత్రుళ్లు డాన్స్ చేసేదాన్నని వైష్ణవి తెలిపింది.

ఎక్కువగా నైట్ బర్త్ డే పార్టీలకు వెళ్లి డాన్స్ చేసేదాన్ని.. 700 రూపాయలు ఇచ్చేవారు. ఆ మనీ తో అమ్మ రైస్ కొనుక్కొచ్చి మాకు కడుపు నింపేదని, యూట్యూబ్ వీడియోలు చేయడానికి కాస్ట్యూమ్స్ ఛేంజ్ చేసుకోవడానికి సెపరేట్ గది ఉండేది కాదని, వాష్ రూమ్ లోకి వెళ్లి ఛేంజ్ చేసుకునేదాన్నినని వెల్లడించింది. దీంతో మా అమ్మ ఇవన్నీ ఎందుకని ఓ సారి చాలా ఏడ్చింది.

ఇక అప్పుడు జీవితంలో ఏదో ఒకటి గట్టిగా సాధించాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. అలాగే ఓ మూవీలో చిన్న పాత్రలో నటించాను. అప్పుడు వాష్ రూం కోసం క్యారవాన్ యూజ్ చేసుకోవచ్చా అని అడిగితే నన్ను చాలా మాటలు అన్నదంటూ వైష్ణవి ఎమోషనల్ అవుతూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బేబి కామెంట్స్ సోషల్ మీడియాలో కొంతమంది అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.


Similar News