"Kantara' to be released in English

రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన కన్నడ సినిమా 'కాంతారా', అక్టోబర్ 15వ తేదీన విడుదలై భారీ వసూళ్లను రాబట్టింది.

Update: 2022-12-07 05:57 GMT

దిశ, సినిమా: రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన కన్నడ సినిమా 'కాంతారా', అక్టోబర్ 15వ తేదీన విడుదలై భారీ వసూళ్లను రాబట్టింది. చెప్పాలి అంటే కన్నడ లో కంటే, తెలుగులో మంచి వసూళ్లను రాబట్టింది. ఇక డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు దక్కించుకుంది. ఈ నవంబర్ 24 నుంచి తెలుగుతోపాటు కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌‌కు వచ్చేసింది. దీంతో ఈ సినిమాను థియేటర్స్‌లో చూడని ప్రేక్షకులు తమ ఇంట్లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక హిందీలో డిసెంబర్ 9 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. మరి ఫైనల్ గా ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తోంది. దీనిని స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయనున్నారు. దీని రిలీజ్ డేట్ అనౌన్స్ జనవరి లోనే ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇంగ్లీష్‌లో ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి.


Also Read...

విడాకులు తీసుకోబోతున్న Hero Nitin.. భార్యకు దూరంగా ఉండనున్నారా? 

Tags:    

Similar News