Jatadhara Movie: సుధీర్ బాబు ‘జటాధర’ సినిమా అప్డేట్.. అంచనాలను పెంచుతున్న పోస్టర్

వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ వరుస సినిమాలతో సుధీర్ బాబు బాక్సాఫీసు వద్ద సందడి చేస్తున్నాడు.

Update: 2024-09-25 07:13 GMT

దిశ, సినిమా: వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ వరుస సినిమాలతో సుధీర్ బాబు బాక్సాఫీసు వద్ద సందడి చేస్తున్నాడు. ప్రజెంట్ ఆయన హీరోగా రాబోతున్న మూవీ జఠాధర. దీనిని వెంకట్ కళ్యాణ్ తెరకెక్కిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే దీనిని ఉజ్వల్ ఆనంద్, ప్రేరణ అరోరా, శివన్ నారంగ్, నిఖిల్ నంద నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. సుధీర్ బాబు ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందుతుంది. అయితే ఈ సినిమా ఫాంటసీ, డ్రామా అంశాల కలయికలో రాబోతుండగా.. 2025 శివరాత్రి కానుకగా విడుదల కాబోతుంది. ఇప్పటికే ‘జటాధర’ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ అందరినీ మెస్మరైజ్ చేసింది.

తాజాగా, జటాధర నుంచి మేకర్స్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సుధీర్ బాబు బైక్‌పై కూర్చుని ఉండగా.. వెనకాల ఓ రాక్షసి నోరు తెరిచి ఆగ్రహంతో ఉంది. ప్రజెంట్ ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. కాగా, జటాధర ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. తొందరలోనే షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.


Similar News