Harihara Veeramallu: ‘హరిహర వీరమల్లు’ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. మూవీలోకి బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఎంట్రీ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాల్లో ‘హరి హర వీరమల్లు’ ఒకటి.

Update: 2024-08-08 11:35 GMT
Harihara Veeramallu: ‘హరిహర వీరమల్లు’ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. మూవీలోకి బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఎంట్రీ
  • whatsapp icon

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాల్లో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. పీరియాడికల్ యాక్షన్ డ్రామగా రాబోతున్న ఈ సినిమాకు మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా.. ఇటీవల ఆ బాధ్యతలను యువ దర్శకుడు జ్యోతి కృష్ణ తీసుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే.. ఇటీవల ఇందులో నుంచి రిలీజైన టీజర్ విశేషంగా ఆకట్టకోండంతో పాటు.. ఫ్యాన్స్‌లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది. ఈ జోష్‌లోనే తాజాగా మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. లెజెండరీ భారతీయ నటులలో ఒకరైన బాలీవుడ్ స్టార్ నటుడు అనుపమ్ ఖేర్‌కు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఈ చిత్రంలో ఆయన అత్యంత విలువైన, రెస్పెక్టబుల్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్‌తో తెరను పంచుకోబోతున్నాడు. ఈ ఇద్దరు అగ్ర నటుల కలయికలో వచ్చే సన్నివేశాలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణంగా నిలుస్తాయని.. అభిమానులను మరింత ఖుష్ అవుతురాని చెబుతున్నారు నిర్మాతలు. ఏదేమైనా 'హరి హర వీరమల్లు' నుంచి వచ్చిన పోస్టర్ సినిమాపై మరింత అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. కాగా.. త్వరలోనే మిగిలిన భాగం చిత్రీకరణను ప్రారంభించనున్నారని తెలుస్తుండగా.. ప్రస్తుతం చిత్రబృందం లొకేషన్ల వేటలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. "హరి హర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ vs స్పిరిట్" త్వరలో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో విడుదల కానుంది. మరిన్ని వివరాలను నిర్మాతలు త్వరలో వెల్లడించనున్నారు.

Tags:    

Similar News