బాబు పుట్టిన రెండు నెలలకే ఆ పని కోసం చాలా పెయిన్ అనుభవించిన కాజల్.. కారణం అదేనా!

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు స్టార్ హీరోలందరితో నటించి టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Update: 2024-05-20 08:25 GMT

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు స్టార్ హీరోలందరితో నటించి టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవి, బాలకృష్ణ, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి హీరోలతో సినిమాలు చేసి తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ లో నటించి తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే గౌతమ్ కిచ్లును ప్రేమించి పెళ్లి చేసుకుంది. కరోనా సమయంలో కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చి పెళ్లి చేసుకొని, బాబుని కని ఫ్యామిలీ లైఫ్ గడుపుతుంది. ఇప్పుడు మళ్ళీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. త్వరలో కాజల్ అగర్వాల్ మొదటిసారి ఫిమేల్ ఓరియెంటెడ్ చేసిన ‘సత్యభామ’ సినిమాతో రాబోతుంది.

తాజాగా సత్యభామ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. నాకు బాబు పుట్టిన తర్వాత రెండు నెలల్లోనే ‘ఇండియన్ 2’ సినిమా కోసం హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాను అప్పుడు చాలా పెయిన్ అనుభవించాను. కానీ కష్టపడి నన్ను నేను బిల్డ్ చేసుకున్నాను. నాలుగేళ్ల క్రితం ఓకే చేసిన సినిమా అది. నేను వద్దనుకుంటే వాళ్ళు వేరే వాళ్ళని తీసుకుంటారు. కానీ నేను ఆ సినిమా చేయాలనుకున్నాను. శంకర్ సార్ కూడా నా డేట్స్ అడ్జెస్ట్ అయ్యేలాగా ప్లాన్ చేసి సపోర్ట్ ఇచ్చారు. నీ ప్లేస్ లో ఇంకొకరిని తీసుకోను భయపడకు అని చెప్పారు. చాలా కష్టంగా ఉన్నా నేను ఇష్టపడి చేశాను, దానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను అని తెలిపింది. దీంతో ఈ భామ అభిమానులు, నెటిజన్లు సినిమాల విషయంలో ఆమెకి ఉన్న డెడికేషన్‌కు అందరు అభినందిస్తున్నారు.


Similar News