చిరంజీవిపై సంచలన కామెంట్స్ చేసిన టాలీవుడ్ హీరోయిన్..!!

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లయ గురించి సుపరిచితమే.

Update: 2024-02-21 07:57 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లయ గురించి సుపరిచితమే. 1992 లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభి.. ‘‘స్వయంవరం, మనోహరం, మనసున్న మారాజు, హనుమాన్ జంక్షన్, ప్రేమించు, రామా చిలకమ్మ, దేవుళ్లు, కోదండ రాముడు, నాలో ఉన్న ప్రేమ, నువ్వు లేక నేను లేను, కొండవీటి సింహాసనం, పెళ్ళాంతో పనేంటి, టాటా బీర్లా’’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

ఇకపోతే లయ రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. గతంలో తనపై వచ్చిన ట్రోల్స్‌ గురించి చెప్పుకొచ్చింది. ‘నాకు మొహమాటం ఎక్కువ. దీంతో పారితోషికం కూడా ఓపెన్‌గా అడగలేకపోయాను. దీంతో ఎన్నో మూవీ అవకాశాలు కూడా మిస్ చేసుకున్నాను. కొన్ని సినిమాలను ప్రొడ్యూసర్లు నాకు రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదు. ఆ సమయంలో పలువురు నాపై దారుణంగా ట్రోల్స్ చేశారు.

యూట్యూబ్ లో వీడియోలు, తంబ్ నెయిల్స్ పెట్టి.. చిరంజీవి నాకు సహాయం చేశాడని పుకార్లు సృష్టించారు. నాకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి హెల్ప్ చేయలేదు. నేను ఎవ్వరిని అడ్డుకునే పరిస్థితిలో లేను. అవి వినడానికి చాలా సిల్లీగా ఉంటాయి. అందరూ వాటిని ఎలా చూస్తారో.. మిలియన్ల వ్యూస్ ఎలా వస్తాయో నాకు అస్సలు అర్థం కావడం లేదు.’’ అంటూ హీరోయిన్ కాస్త ఘాటు కామెంట్స్ చేసింది. ప్రస్తుతం లయ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Similar News