నాటి బొక్కల మొఖం వ్యక్తే నేడు స్టార్ హీరో.. టాలీవుడ్‌లో అంతా అదే టాక్

ఆయన్ని చూసిన వారు మొదట నీవు హీరో ఎలా అవుతావు అన్నారు.

Update: 2023-06-28 10:01 GMT

దిశ, వెబ్​డెస్క్​ : ఆయన్ని చూసిన వారు మొదట నీవు హీరో ఎలా అవుతావు అన్నారు. కానీ నేడు ఆయన్ని అందరూ అనుసరిస్తున్నారు. ఆయనే డీజే టిల్లు హీరో జొన్నలగడ్డ సిద్దు. నేడు ఈయన ఓ క్రేజీ హీరో. నేడు అవకాశాలు క్యూ కడుతున్నాయి. మరో విషయం ఏమిటంటే అతని మ్యానరిజమ్ ని బేస్ చేసుకుని స్టోరీలు సిద్దం చేస్తున్నారట. ఇక సోషల్ మీడియాలో సిద్దు నిత్యం వైరల్ అవుతునూ ఉంటాడు. వైవిధ్యమైన వేషధారణతో ఆకట్టుకుంటుంటాడు. నిజానికి ఆయన ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చాడు. ఈయన మొదటి సినిమా జోష్. ఆ తర్వాత అడపాదడపా రెండు మూడు సినిమాలు చేసినా అనుకున్న ఫలితం రాలేదు.

    అసలు విషయం ఏమిటంటే ఈయన మొదట సినిమాల్లో ప్రయత్నించినప్పుడు ముఖం మీద మొటిమలు కావడంతో విపరీతమైన మచ్చలుండేవి. అక్కడక్కడా గుంతలు కూడా ఉండేవి. అది చూసిన ఓ వ్యక్తి నీ మొఖం ఎప్పుడైనా అర్దంలో చూసుకున్నావా నీవు సినిమా హీరో ఎలా అవుదామనుకుంటున్నావు అని అడిగేశాడట. దాంతో ఆయన తెగ ఏడ్చేశాడట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పాడు. దీనినిబట్టి మనకి తెలిసిందేమిటంటే ఎవరో ఏదో అన్నారని ఓ మూలకు కూర్చోకుండా మనలోని టాలెంట్​ని బయటపడితే మనల్ని తిట్టిన నోర్లే తరువాత పొగుడుతాయని అర్ధమవుతుంది.  

Read More:   శృంగార సన్నివేశంలో హీరోకు అక్కడ ముద్దుపెట్టిన నటి.. డేటాల్‌తో నోరు కడిగేసుకుందట 

Tags:    

Similar News