నేడు సీనియర్ నటుడు తనికెళ్ల భరణి పుట్టినరోజు

తనికెళ్ల భరణి పేరు వినగానే ఆట కదరా శివ, నాలోని శివుడు గలడు..

Update: 2024-07-14 03:41 GMT

దిశ, సినిమా: తనికెళ్ల భరణి పేరు వినగానే ఆట కదరా శివ, నాలోని శివుడు గలడు.. నీ లోని శివుడు గలడు అన్న పాటలు గుర్తు వస్తుంటాయి. జులై 14, 1956న పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు . సినిమాలలో తన నటనతో హాస్యం పండించ గలడు అలాగే ఏడిపించగలడు కూడా.. తెలుగులో నటుడిగా గుర్తింపు పొందడమే కాకుండా ఎన్నో అవార్డులను కూడా అందుకున్నాడు. అనేక ప్రధాన పాత్రలు పోషించాడు. ఇతనికి ప్రముఖ దర్శకుడు వంశీ స్నేహితుడు. సొగసు చూడతరమా, ఎగిరేపావురమా, మావిచిగురు, పరదేశి సినిమాలలో భరణి తన నట విశ్వరూపం చూపించాడు. కామెడీ,విలన్, వైవిధ్యమైన పాత్రలను పోషించి భరణి ప్రజాదరణ పొందాడు. ఆయన మొత్తం 200 కు పైగా సినిమాలో నటించాడు. నేడు తన 68 వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.


Similar News