నేడు Megastar Chiranjeevi పుట్టినరోజు
కొణిదెల శివశంకర వరప్రసాద్ అంటే ఎవరికి తెలియపోవచ్చు
దిశ,వెబ్ డెస్క్: కొణిదెల శివశంకర వరప్రసాద్ అంటే ఎవరికి తెలియపోవచ్చు కానీ మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు గ్రామంలో కొణిదెల వెంకట్రావు-అంజనాదేవిలకు పుట్టిన మొదటి సంతానం. జన్మించారు. సినిమాలపై ఉన్న మక్కువతో మద్రాసు రైలు ఎక్కి ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. కెరీర్ మొదట్లో విలన్ పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకుని ఆ తరువాత హీరోగా పరిచయమయ్యి కొన్ని కోట్ల అభిమానాన్ని సంపాదించారు. ఆయన అభిమానులు ముద్దుగా అన్నయ్య అని పిలుచుకుంటారు. ఇప్పటికి 150కి పైగా సినిమాలు చేసారు. తాను సంపాదించిన దానిలో కొంత పేద ప్రజలకు సాయం చేస్తూ జనాల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. నేడు చిరు 68 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు పుట్టిన రోజు వేడుకలను పండుగలా జరుపుతున్నారు.