నేడు కోట శ్రీనివాసరావు బర్త్ డే

తెలుగు సినీ ఇండస్ట్రీలో కోట శ్రీనివాసరావు స్థానం చాలా ప్రత్యేకం.

Update: 2024-07-10 02:25 GMT

దిశ, సినిమా: తెలుగు సినీ ఇండస్ట్రీలో కోట శ్రీనివాసరావు స్థానం చాలా ప్రత్యేకం. తండ్రి పాత్రల నుంచి విలన్ పాత్రల వరకు న్యాయం చేయగల సత్తా ఉన్నా నటుడు. అతని నటనతో నవ్వించడమే కాకుండా భయంకరమైన విలనిజాన్ని కూడా చూపించి భయపెట్టగలడు. విలనిజంలో కూడా కామెడీని పండించడం ఒక్క కోట శ్రీనివాసరావుకే  సాధ్యం. ఒక పాత్ర అని కాకుండా ఎన్నో రకాల పాత్రలకు కొత్త రూపు తీసుకొచ్చారు. తండ్రిగా ఆయన చేసిన సినిమాలు ఆడవారు మాటలకు అర్థాలే వేరులే, బొమ్మరిల్లులో అందర్ని అలరించారు. ఇక బాబు మోహన్‌తో కలిసి పని చేసిన ప్రాజెక్ట్ లు ఓ సంచలనమే. సినిమాలు మాత్రమే కాకుండా కోట రాజకీయాల్లోనూ రాణించారు. తెలుగు నటీ నటులు కోసం ఆయన ఎంతగానో పోరాడారు. ఇతర భాష నటులకు ప్రాధాన్యత ఇవ్వడం పట్ల కోట బహిరంగంగానే విమర్శించారు. ఇలా చెప్పుకుంటూ పొతే చాలానే ఉన్నాయి. నేడు కోట శ్రీనివాసరావు పుట్టినరోజు. ఈ సందర్భంగా నటీ నటులు ఆయనకు విషెస్ తెలుపుతున్నారు. 


Similar News