Genelia Birthday: నేడు జెనీలియా డిసౌజా పుట్టినరోజు

అంతేనా వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ అనే డైలాగ్ తో ఫేమస్ అయినా జెనీలియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Update: 2024-08-05 02:19 GMT

దిశ, సినిమా: అంతేనా వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ అనే డైలాగ్ తో ఫేమస్ అయినా జెనీలియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీ హిట్ కొట్టిన బొమ్మరిల్లు మూవీలో హాసిని పాత్ర అందరికి గుర్తుండి పోతుంది. ఈ మూవీలో డబ్బింగ్ ఆర్టిస్ట్ సవితా రెడ్డి చెప్పిన వాయిస్ హైలెట్ గా నిలిచింది. అంతక ముందు వరకు ఎలాంటి క్రేజ్, గుర్తింపు రాని జెనీలియాకు బొమ్మరిల్లు గుర్తుండి పోయే మెమొరీస్ ను ఇచ్చింది. తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళ, మరాఠీ సినిమాల్లో కూడా నటించింది. 2012లో నటుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కొంత కాలం బ్రేక్ తీసుకుంది. మధ్యలో గెస్ట్ రోల్స్‌ లో మెరిసి అందర్ని ఆకట్టుకుంది. జెనీలియా అద్భుత క్రీడాకారిణి కూడా ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి రాకముందు ఆటల్లో ముందుండేది. ఆమె రాష్ట్ర స్థాయి క్రీడాకారిణి, జాతీయ స్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారిణి. నేడు జెనీలియా తన 37 వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఆమెకి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.

Tags:    

Similar News