Super Star Krishna: ఇంజనీర్ కావాలని.. నటుడిగా రాణించి
కృష్ణ 1943 మే 31న గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి 4 కిలో మీటర్ల దూరంలోని బుర్రిపాలెం గ్రామస్తులైన వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతుల పెద్ద కొడుకుగా జన్మించాడు.
దిశ, వెబ్ డెస్క్: కృష్ణ 1943 మే 31న గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి 4 కిలో మీటర్ల దూరంలోని బుర్రిపాలెం గ్రామస్తులైన వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతుల పెద్ద కొడుకుగా జన్మించాడు. అతనిది రైతు కుటుంబం. ఇంజనీర్ కావాలనేది కృష్ణ తల్లిదండ్రుల కోరిక కాగా అందుకోసం ఆయన ఎంపీసీలో చేరేందుకు ప్రయత్నించారు. గుంటూరు కళాశాలలో సీటు దొరకకపోవడంతో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఎంపీసీ గ్రూపుతో ఇంటర్ లో చేరారు. అక్కడ మూడు నెలలే చదివి సీ.ఆర్. రెడ్డి కళాశాలకు మారారు. అక్కడే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత బీఎస్సీ చదివారు. నటుడు మురళిమోహన్ కృష్ణ క్లాస్ మేట్, మంచి స్నేహితులు. కృష్ణ డిగ్రీ చదువుతుండగా ఏలూరులో ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా సన్మానం చేయడాన్ని చూశాడు. సినీ పరిశ్రమలో ఉంటేనే ఇంతటి ప్రజాధరణ వస్తుందని గుర్తించాడు. డిగ్రీ పూర్తి చేశాక ఇంజనీరింగ్ కోసం ప్రయత్నించినా సీటు రాకపోవడంతో నటనపై దృష్టి సారించారు.
Read more:
1.ఈ రికార్డు ఒక్క సూపర్ స్టార్ కృష్ణకే సొంతం !