Mega Paint: ఒకే పెయింట్‌లో ముగ్గురు మెగా హీరోలు.. ఫోటో చూస్తే మతి పోవాల్సిందే..

ఒకే పెయింట్‌లో ముగ్గురు మెగా హీరోలు

Update: 2024-09-04 06:43 GMT

దిశ, వెబ్ డెస్క్: ఒక మనిషి పై చెప్పలేనంత ఇష్టం ఉంటే దానిని అభిమానంగా చెబుతుంటాము. సాధారణంగా అభిమానులు, తమకు ఇష్టమైన నటీ నటుల పై ఏదో ఒక సందర్భంలో ప్రేమను చూపిస్తూనే ఉంటారు. కొందరైతే వారి ప్రేమను డిఫరెంట్ గా వ్యక్తపరుస్తారు. తాజాగా, ఓ ఆర్టిస్ట్ వేసిన పెయింట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

ఆగస్టు 22 న చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. ఆ రోజు కుప్పం కు చెందిన ఓ ఆర్టిస్ట్ ఒక 3D పెయింట్ వేసాడు. ఈ పెయింట్ లో ఒక గమ్మత్తు ఉంది.. దాన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు అదేంటో ఇక్కడ చూద్దాం..

అతడు వేసిన ఒకే పెయింట్ లో మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi ) , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (pawan kalyan) , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan) ఇలా ముగ్గురు ఉన్నారు. ముందు నుంచి నిలబడి చూస్తే చిరంజీవి, ఓ వైపు నుంచి చూస్తే పవన్ కళ్యాణ్, మరో వైపు నుంచి చూస్తే రామ్ చరణ్ కనిపిస్తారు. ప్రస్తుతం, ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇది చూసిన హీరోల ఫ్యాన్స్ , నెటిజన్లు బొమ్మ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Full View

Tags:    

Similar News