డ్యాన్స్ అంటే చిరంజీవి గారు.. చిరంజీవి గారు అంటే డ్యాన్స్.. :  సాయి ధరమ్ తేజ్

డ్యాన్స్ అంటే చిరంజీవి గారు..చిరంజీవి గారు అంటే డ్యాన్స్

Update: 2024-09-23 03:16 GMT

దిశ, వెబ్ డెస్క్ : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మామయ్యలు అంటే తేజ్ కు ఎంత ఇష్టమో మనం చాలా సందర్భాలలో చూసాము. ఇక మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదైనా సాధిస్తే అందరి కంటే ముందు రియాక్ట్ అయ్యేది సాయి ధరమ్ తేజ్.

ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచినప్పుడు తేజ్ సంతోషానికి అవధులు లేవు. ఫ్యామిలీ పార్టీస్ లో కూడా తేజ్ చాలా సరదాగా ఉంటాడు. ఇక సంతోషం ఎక్కువైతే విజిల్స్ వేస్తూ హడావుడి చేస్తుంటాడు. చిరంజీవి తన డ్యాన్స్ కు గాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించారు. ఈ ఈవెంట్ కు మెగా కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. వారిలో సాయి తేజ్ కూడా హాజరయ్యాడు. చిరంజీవి ఆ రికార్డు అందుకునేటప్పుడు మరోసారి విజిల్స్ వేస్తూ సందడి చేసాడు తేజ్.

సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ వేదికగా చిరంజీవి కంగ్రాట్స్ చెప్తూ.. " డ్యాన్స్ అంటే చిరంజీవి గారు.. చిరంజీవి గారు అంటే డ్యాన్స్.. ఊహ తెలిసాక నాకు తెలిసిన హీరో చిరంజీవి గారే.. డ్యాన్స్ అంటే ఆయన స్టెప్పులే.. ఆ నాట్యానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కడం అరుదైన ఘట్టం " అంటూ ట్వీట్ లో రాసుకొచ్చారు.

Tags:    

Similar News