Actress Sadha : హీరోయిన్ సదా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదేనట!
దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ సదా అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు.
దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ సదా అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు. 'రాను రానంటూనే సిన్నదో' అనే పాటతో సినిమా ప్రేక్షకులకు దగ్గరైయింది. ఆ తర్వాత తమిళ స్టార్ హీరో విక్రమ్‌తో అపరిచితుడు సినిమాలో నటించి బాగా పాపులర్ అయింది. ఆ తరువాత అవకాశాలు రాకనో లేక ఇతర కారణాల చేతో కొంత కాలం పాటు సినిమాల్లో కనిపించకుండా పోయారు. అయితే, ఆమె ఇప్పుడు వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆమెకు 40ఏళ్లు నిండుతున్నా సదా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు.. ఆమె ఇంకా ఒంటరి జీవితాన్నే గడుపుతున్నారు. అయితే, తాజాగా సదా తన పెళ్లి విషయంలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పెళ్లిపై తనకు ఆలోచన లేదని తెలిపారు. తనను పెళ్లి చేసుకునే వాడు తన సంపాదనపై ఆధారపడకుండా జీవించాలన్నారు. అలాంటి వ్యక్తి తనకు ఇంకా తగల్లేదని అంతుకే తాను ఇంకా పెళ్లి చేసుకోలేదని చెప్పారు. అయితే ప్రస్తుతం ఆమె ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు.