Srimukhi:శ్రీముఖి పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదేనట.. స్వయంగా చెప్పిన యాంకరమ్మ
బుల్లితెర యాంకర్ శ్రీముఖి వయసు మీద పడుతున్నా.. ఇంకా పెళ్లి ఊసెత్తని ఈ అందాల భామ తాజాగా పెద్ద సీక్రెట్ బయటపెట్టింది.
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర యాంకర్ శ్రీముఖి వయసు మీద పడుతున్నా.. ఇంకా పెళ్లి ఊసెత్తని ఈ అందాల భామ తాజాగా పెద్ద సీక్రెట్ బయటపెట్టింది. ఇన్నాళ్లు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో చెప్పింది. తాను యాంకర్‌గా చేస్తున్న ‘‘స్టార్ మా పరివార్’’ షోలో తెలిపింది. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. షో మధ్యలో జబర్దస్త్ కమెడియన్ ఫైమా పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. శ్రీముఖి ‘‘ గెస్ట్ లుగా వచ్చిన వారంతా భార్యలతో ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో ప్రత్యక్షంగా చూశా కదా. పెళ్లైతే ఇన్ని కష్టాలుంటాయనే చేసుకోవడం లేదు అర్థమైందా నీకు అంటూ ఫైమాకు సమాధానం చెప్పింది. వెంటనే ఫైమా అందరి ముందు శ్రీముఖి గాలి తీసింది. నేనింకా.. నీకు ఎవరు రావడం లేదేమో అనుకుంటున్నా, అంటూ ముఖం మీదే అనేసింది. దీంతో శ్రీముఖి ముఖం మాడిపోయింది. షోలో ఒక్కసారిగా నవ్వులు పూయించింది.
Read more: అందం కోసం అటువంటి పనులు చేస్తున్న యాంకర్ శ్రీముఖి..!