గేమ్ ఛేంజర్ మూవీలో ఐఏఎస్ ఆఫీసర్ గా రామ్ చరణ్ పేరు ఇదే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం గేమ్ ఛేంజర్.

Update: 2024-07-07 13:10 GMT

దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఆర్‌ఆర్‌ఆర్ సక్సెస్ తర్వాత ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంది కానీ షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచి చిత్ర యూనిట్ టైటిల్ పోస్టర్‌ను మాత్రమే విడుదల చేసింది. ఈ ప్రాజెక్ట్ ప్రారంభించి మూడేళ్లు గడిచినా సినిమా ఇంకా విడుదల కాలేదు.

టైటిల్ పోస్టర్, గేమ్ ఛేంజర్ మూవీకి సంబంధించి పాటలు తప్ప ఇతర అప్‌డేట్‌లు ఏమి లేవు. ఈ సినిమా విడుదల తేదీ కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు. దీంతో గేమ్ ఛేంజర్ అప్‌డేట్‌పై మెగా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు గేమ్ ఛేంజర్ చిత్రానికి సంబంధించిన కొన్ని పోస్టర్లు వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయినా సంగతి మనకి తెలిసిందే.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి బయటికొచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ముగుస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో చరణ్ పొలిటికల్ లీడర్‌గా, ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఐఏఎస్ ఆఫీసర్ గా చరణ్ పేరు రామ్ నందన్ అని తెలిసిన సమాచారం. లీకైన చెర్రీ లుక్స్ తో పోలిస్తే పేరు కూడా సెట్ అయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Similar News