నన్ను ఆ విధంగా కూడా వాడుకుంటూ టాలీవుడ్లో బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. పాయల్ సెన్సేషనల్ పోస్ట్
యంగ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంలోనే తన అందం, అభినయం నటనతో ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ సంపాదించి ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఇటీవల పాయల్ మంగవారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘రక్షణ’ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఈ మూవీ జూన్ 7న రిలీజ్ కానుంది.
ఈ క్రమంలో..తాజాగా, పాయల్ రాజ్‌పుత్ ఓ సంచలన పోస్ట్ పెట్టి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా తనను కొందరు భయపెడుతున్నారంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘ రక్షణ సినిమా ఉంది. అది 2019-2020 మధ్యలో షూట్ చేశాము. దాని ఒరిజినల్ టైటిల్ 5ws. రిలీజ్ కొంచెం లేట్ అయింది. అయితే ఇప్పుడు వాళ్లు నాకున్న పాపులారిటీని రీసెంట్గా వచ్చిన సక్సెస్‌ను చూసి ఈ సినిమాను కూడా రిలీజ్ చేసి బెనిఫిట్ పొందాలని ఆశపడుతున్నారు.
నాకు వాళ్లు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇంకా ఇవ్వలేదు. అంతేకాకుండా ప్రమోషన్స్‌కు రమ్మని అడుగుతున్నారు. నా టీమ్ వాళ్లతో మాట్లాడారు. అయినప్పటికీ వాళ్లు నన్ను టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాన్ చేస్తామని భయపెడుతున్నారు. నా టీం రక్షణ సినిమా డిజిటల్ ప్రమోషన్స్‌కు వస్తామని వాళ్లకి చెప్పారు. అలాగే నాకు ఇవ్వాల్సిన బాకీ క్లియర్ చేయండి అని సూచించింది. అయినా వారు రాజీకి వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. నా పేరును డ్యామేజ్ చేసే విధంగా వాడుతున్నారు. ఇటీవల జరిగిన మీటింగ్స్‌లో అసభ్య పదజాలం వాడారు. కొన్ని ఆస్తులను పాయల్ అడిగారని లేదంటే సినిమా విడుదలకు ఒప్పుకోరని నా పేరును వాడుకుంటున్నారు.
నాకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ పూర్తిగా ఇవ్వకుండా సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నందుకు నేను చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే వారు నాకు రెమ్యునరేషన్ ఇవ్వకుండా.. నా అనుమతి లేకుండా రక్షణ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం పాయల్ పోస్ట్ నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. దీంతో అది చూసిన నెటిజన్లు ఎవడు నిన్ను బ్యాన్ చేస్తా అని బెదిరించేది చెప్పు నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు.