తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్లు అందుకుంటున్న అగ్ర హీరోలు వీరే!
ప్రపంచంలోనే అన్ని సినిమా పరిశ్రమల్లోనూ భారతీయ సినీ ఇండస్ట్రీకీ ఎంతో ప్రాముఖ్యత ఉంది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అన్ని సినిమా పరిశ్రమల్లోనూ భారతీయ సినీ ఇండస్ట్రీకీ ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎన్నో వేల కోట్ల రూపాయలను టర్నోవర్‌ను ఈ ఇంటస్ట్రీ సాధిస్తోన్న విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్‌లో అత్యధిక రెమ్మునరేషన్లు అందుకుంటున్న విషయానికొస్తే... పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి మొదలు పెట్టి పవన్ కళ్యాణ్ వరకు చాలా మంది అగ్రహీరోలు ఒక్కొక్క సినిమాకీ కొన్ని కోట్లల్లోనే రెమ్యూనేషన్ చేస్తున్నారని సమాచారం. కాగా.. అత్యంత భారీ స్థాయిలో పారితోషికాలను అందుకుంటున్న అగ్రహీరోల గురించి తెలుసుకుందాం.
ప్రభాస్ బహుబలి చిత్రంతో రికార్డ్ బద్దలు కొట్టి మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా హీరోగా ముద్ర వేసుకున్నారు. ఇప్పటివరకు ఆయన చిత్రాలన్నీ దాదాపుగా పాన్ ఇండియా లెవెల్‌లోనే విడుదలవుతాయి. ఈ స్టార్ ఒక్కొక్క సినిమాకి సుమారు 100 కోట్ల నుంచి 200 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నారట. ఇక అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో రెండవ స్థానాన్ని సంపాదించాడు.
బన్నీ పుష్ప తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఆయన ఒక్కొక్క మూవీకి 60 నుంచి 125 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నారట. ఆ తర్వాత స్థానాన్ని జూనియర్ ఎన్టీఆర్ దక్కించుకున్నారు. రీసెంట్‌గా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో హిట్టు కొట్టిన ఆయన ఒక్కొక్క మూవీకి 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నారని సమాచారం.
అలాగే వరుసగా... రామ్ చరణ్... 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు, సూపర్ స్టార్ మహేష్ బాబు 60 నుంచి 80 కోట్ల వరకు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 50 నుంచి 75 కోట్లు, మెగాస్టార్ చిరంజీవి 50 నుంచి 60 కోట్లు, విజయ్ దేవరకొండ ఒక్కొక్క సినిమాకి 27 కోట్ల నుంచి 45 కోట్ల వరకు, నందమూరి బాలకృష్ణ 18 నుంచి 30 కోట్లు, ఇక టాప్ 10లో రవితేజ కూడా స్థానం దక్కించుకున్నారు. ఆయన హిట్లతో సంబంధం లేకుండా ఒక్కొక్క సినిమాకు సుమారుగా 15 కోట్ల నుంచి 20 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నారట.
Also Read...
దీపిక నా కన్న ఎక్కువే తీసుకుంది.. ఆ విషయంలో మాట్లాడే అర్హత లేదు..