జూలైనెలలో ఈటీవీ విన్లో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే!
ప్రస్తుతం ఓటీటీలో వెబ్ సిరీస్, సినిమాల హవా కొనసాగుతోంది. చాలా మంది ఓటీటీవైపే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడంతో, ఓటీటీ కూడా కొత్త వెబ్ సిరీస్, సినిమాలను విడదల చేస్తూ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది
దిశ, సినిమా : ప్రస్తుతం ఓటీటీలో వెబ్ సిరీస్, సినిమాల హవా కొనసాగుతోంది. చాలా మంది ఓటీటీవైపే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడంతో, ఓటీటీ కూడా కొత్త వెబ్ సిరీస్, సినిమాలను విడదల చేస్తూ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. కాగా ఈనెలలో ఈటీవీ విన్లో పలు సినిమాలు సందడి చేయనున్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
౧.హరోంహర : జ్ఞానసాగర్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా నటించిన చిత్రం హరోంహర. ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్గా నటించింది. కాగా, ఈ మూవీ ఈ నెలలో ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ కాబోతుంది.
2. ఖో ఖో : ప్రేమలు బ్యూటీ మమితా బైజు, రజిషా విజయన్ హీరోయిన్స్‌గా నటించిన మూవీ ఖోఖో, ఈ మూవీని రాహుల్ రిజి నాయర్ లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కించారు. కాగా, ఈ మూవీ కూడా జూలై నెలలో ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ కానుంది.
3. మాధవే మధుసూదన : బొమ్మర దేవర రామచంద్రరావు, దర్శకనిర్మాతగా వ్యవహరించిన చిత్రం మాధవే మధు సూదన. ఈ సినిమాలో తేజ బొమ్మదేవర, రిషికి లక్కే జంటగా నటించారు. కాగా, ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో ఈ నెలలో విడుదలై సందడి చేయనుంది.
ప్రభాస్ తో నా ఉఛ్వాసం కవనం పేరుతో ఓ స్పెషల్ ప్రోగ్రాం రానుంది. కాగా, ఇది కూడా ఈనెలలో ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.