అప్పుడు చాలా భయమేసింది.. అవే నా జీవితంలో చీకటి రోజులు: ప్రియాంక చోప్రా ఎమోషనల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫుల్ పాపులారిటీ తెచ్చుకుని గత కొద్ది కాలంగా ఇండస్ట్రీలో రాణిస్తుంది.
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫుల్ పాపులారిటీ తెచ్చుకుని గత కొద్ది కాలంగా ఇండస్ట్రీలో రాణిస్తుంది. ప్రస్తుతం హాలీవుడ్లో వరుస చిత్రాలు చేస్తూ దుూసుకెళ్తుంది. ఇక ప్రియాంక చోప్రా ( Priyanka Chopra ) పర్సనల్ విషయానికొస్తే.. నటుడు, గాయకుడు నిక్ జోనస్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ ఓ కూతురు కూడా ఉంది. ప్రియాంక చోప్రా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూనే.. కెరీర్లో ముందడుగు వేస్తుంది.
ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు ఒకానొక సమయంలో ఎదురైన అనుభవాల గురించి వివరిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ‘‘నేను భాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిన తర్వాత నా కెరీర్ మళ్లీ స్టార్ట్ అయిందా? అనిపించింది. హాలీవుడ్లో ఎవరూ తెలియకపోవడంతో ఒంటరిగా ఫీలయ్యాను. అలాగే కొన్ని సార్లు చాలా భయపడి పోయేదాన్ని. అయితే కొందరు రిజెక్ట్ చేశారు. దీంతో హాలీవుడ్లో నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు చీకటి రోజులుగా గడిచాయి. ఇండియాలోనే స్టార్ హీరోయిన్ను నేను అయినప్పటికీ హాలీవుడ్లో మాత్రం దాన్ని మర్చిపోయి.. నా పనిలో నిమగ్నమయ్యే దాన్ని. అలా చేశాను కాబట్టి ఇప్పుడు హాలీవుడ్లో కూడా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాను. ప్రస్తుతం మంచి స్థాయిలో ఉండగలిగాను నేను నమ్ముతున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది.
Read More...
మృణాల్‌కు ఎంగేజ్మెంట్ రింగ్ పంపిన స్టార్ సెలబ్రిటీ.. అమ్మాయి దొరికింది అంటూ పోస్ట్..