‘బేబీ’ సినిమా చూశాక వైష్ణవి చైతన్యపై ఆ విధంగా పగ తీర్చుకున్న యువకుడు..?
బుల్లితెర నటి వైష్ణవి చైతన్య ఇటీవల ‘బేబీ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ 14న రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకుంది.
దిశ, వెబ్ డెస్క్: బుల్లితెర నటి వైష్ణవి చైతన్య ఇటీవల ‘బేబీ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ 14న రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా వచ్చి రికార్డు కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతుంది.
ఇందులో వైష్ణవి చైతన్య హీరోలను ప్రేమించి మోసం చేసి మూడోవాడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోతుందట. దీంతో ఆ పాయింట్‌కు నేటి యువత చాలా కనెక్ట్ అయ్యి మాజీ ప్రేయసిని గుర్తు తెచ్చుకుంటున్నారు.
తాజాగా, ఓ యువకుడు బేబీ సినిమా చూసిన తర్వాత వైష్ణవి పోస్టర్‌ను చెప్పుతో కొట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన మాజీ ప్రేయసిని గుర్తు చేసుకుని వైష్ణవిని కొట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
Read More: U.S లో కూడా దూసుకుపోతున్న ‘Baby’