Singer Rahat: దుబాయ్‌ ఎయిర్ పోర్టులో ఆ స్టార్ సింగర్ అరెస్ట్.. రియాక్షన్ ఇదే

దుబాయ్‌ ఎయిర్ పోర్టులో స్టార్ సింగర్ అరెస్ట్

Update: 2024-07-23 03:38 GMT

దిశ,సినిమా : సాధారణంగా సెలబ్రిటీలు ఏం చేసినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది మంచి విషయం అయితే రెండు రోజుల వరకు నెట్టింట ఆ వార్తలే వైరల్ అవుతుంటాయి అదే చెడు అయితే అది నిజమో..అబద్దమో తెలుసుకోకుండా న్యూస్ లు నెగిటివ్ గా రాస్తూనే ఉంటారు. తాజాగా అలాంటి ఘటనే జరిగింది.

దుబాయ్‌ ఎయిర్ పోర్టులో స్టార్ సింగర్ రహత్ ఫతే అలీ ఖాన్ ను అరెస్టు చేసినట్లు పలు రకాల వార్తలు వచ్చాయి. ఇంతకు ముందు అతని దగ్గర పని చేసిన సల్మాన్ ఫిర్యాదుతో పోలీసులు అరెస్టు చేసిన వార్తల్లో ఎలాంటి నిజం లేదంటూ పోస్ట్ షేర్ చేసాడు.

మాజీ మేనేజర్ సల్మాన్, సింగర్ రహత్ ఫతే అలీ ఖాన్‌పై పరువు నష్టం కేసు పెట్టారని పోలీసులు చెప్పినట్టు న్యూస్ లు వచ్చాయి. ఇది ఫేక్ న్యూస్.. నేను దీన్ని ఖండిస్తున్నాను వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటివి రాయకండి అంటూ రహత్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసాడు. వీరి మధ్య గత కొంత కాలం నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా రాహత్, అహ్మద్ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారని తెలిసిన సమాచారం. 

Tags:    

Similar News