నిత్యామీనన్‌ను రెండో పెళ్లి చేసుకుంటానని ఇబ్బంది పెట్టిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
మలయాళ బ్యూటీ నిత్యామీనన్‌కు ఫ్యాన్స్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. ఈ అమ్మడు నాని ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
దిశ, వెబ్ డెస్క్: మలయాళ బ్యూటీ నిత్యామీనన్‌కు ఫ్యాన్స్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. ఈ అమ్మడు నాని ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, నితిన్, అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి తన అందంతో ప్రేక్షకులను మెప్పించింది. నిత్యామీనన్ ఎక్కువగా ఎక్స్పోజింగ్ చేయకుండా గ్లామరస్ పాత్రల్లో నటించకుండానే మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అయితే నిత్యామీనన్‌ను ఓ స్టార్ హీరో ఇబ్బంది పెట్టినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తనను ఇబ్బంది పెట్టిన హీరో గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మిమ్మల్ని దుల్కర్ సల్మాన్ నిజంగానే రెండో పెళ్లి చేసుకోమని అడిగాడు అని యాంకర్ అడగ్గా.. నిత్యా స్పందిస్తూ.. ‘‘ అవును దుల్కర్ నన్ను ప్రతిసారి అలా అడిగేవాడు. కానీ, అది మా మధ్య ఉండే స్నేహం తోనే అడిగాడు. మేము ఎప్పుడు అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం. దుల్కర్ ప్రతిసారి నన్ను రెండో పెళ్లి చేసుకోమని ఆటపట్టించేవాడు. మళ్లీ నాకు వయసు వచ్చేవరకు ఎవరినో ఒకరిని చూసి తొందరగా పెళ్లి చేసుకో అంటూ ఇబ్బంది పెట్టేవాడు. కానీ, నేను మాత్రం నాకు పెళ్లి మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. టైమ్ వస్తే చేసుకుంటాను లే అని చెప్పేదాన్ని’’ అంటూ తెలిపింది.
Read More: ఆ నటి, ఆమె కూతురు ఇద్దరూ సెక్స్ బానిసలే.. పెళ్లైనా కూడా ఇతర వ్యక్తులతో అదే పని.. ట్వీట్ వైరల్