Heroine Vedhika : మరోసారి భయపెట్టడానికి సిద్ధమవుతున్న వేదిక..
మరోసారి భయపెట్టడానికి సిద్ధమవుతున్న వేదిక.
దిశ, వెబ్ డెస్క్ : హీరోయిన్ వేదిక రీ ఎంట్రీ ఇచ్చిన విషయం మనకి తెలిసిందే. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ కొత్త సిరీస్ 'యక్షిణి' లో నటించింది. ఇది తెలుగుతోనే కాకుండా హిందీ, మలయాళ, బెంగాలీ, తమిళ, కన్నడ, మరాఠీ భాషల్లో రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ హిట్ అవ్వడంతో చేసిన హీరోయిన్ వేదిక పాపులారిటీ ఇంకా పెరిగింది. దీంతో ఎన్నో ఆఫర్స్ వచ్చాయి.. కానీ, ఆమె తొందరపడకుండా ఆచి తూచి అడుగులు వేస్తుంది.
తెలుగులో ముని, విజయదశమి, బాణం, కాంచన.. లాంటి పలు మూవీస్ తో మంచి పేరు తెచ్చుకుంది వేదిక. ఈ మధ్య హర్రర్ మూవీస్ లో నటిస్తూ అందర్ని మెప్పిస్తుంది. వేదిక మెయిన్ లీడ్ లో సస్పెన్స్ థ్రిల్లర్ కథతో ఫియర్ అనే మూవీతో మనల్ని భయపెట్టడానికి మళ్ళీ వచ్చేస్తుంది.
తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను స్టార్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా విడుదల చేసారు. ఈ పోస్టర్ లో వేదిక ఒక్కటే చీకటి గదిలో భయపడుతూ కూర్చుంది. కొద్దీ రోజుల్లో ఫియర్ మూవీ థియేటర్లో సందడీ చేయనుంది. దత్తాత్రేయ మీడియా పతాకం పై ఏఆర్ అభి నిర్మాణంలో హరిత గోగినేని డైరెక్షన్ లో ఈ ఫియర్ మూవీని నిర్మించారు. ఈ మూవీలో నటుడు అరవింద్ కృష్ణ స్పెషల్ రోల్ చేయగా పవిత్ర లొకేష్, సాహితి దాసరి, అనీష్ కురువిల్ల, షాయాజీ షిండే, సత్య కృష్ణ, షాని.. ముఖ్య పాత్రల్లో పోషించారు.
Read More..
నేరుగా ఓటీటీలోకి తెలుగు కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?