Film Industry: అగ్ర హీరోను టార్గెట్‌ చేసిన ప్రొడ్యుసర్స్.. దానికి అనుమతి తప్పనిసరి అంటూ కండీషన్స్

అగ్ర కథానాయకుడు విశాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళంలోనే కాకుండా ఆయన నటించిన అనేక చిత్రాలు తెలుగులోనూ అద్భుతంగా రాణించాయి.

Update: 2024-07-26 14:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: అగ్ర కథానాయకుడు విశాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళంలోనే కాకుండా ఆయన నటించిన అనేక చిత్రాలు తెలుగులోనూ అద్భుతంగా రాణించాయి. ఒకానొక దశలో తమిళంలో సరిగా ఆడని సినిమాలు సైతం తెలుగులో మంచి కలెక్షన్స్ సాధించాయి. ప్రస్తుతం విశాల్ చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. ఆయన్ను తమిళ నిర్మాతల మండలి టార్గెట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. విశాల్‌ను హీరోగా పెట్టి సినిమాలు తీయాలంటే అటు దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు అందరూ పర్మిషన్ తీసుకోవాలని కండీషన్ పెట్టిందట తమిళ నిర్మాతల మండలి.

Read more...

‘నన్ను ఎవరూ ఆపుతారో చూస్తా’.. నిర్మాతల మండలికి హీరో విశాల్ స్ట్రాంగ్ వార్నింగ్..! 




అయితే, 2017-2019 వరకు తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ కొనసాగారు. ఆ సమయంలో విశాల్0 రూ.12 కోట్లు దుర్వినియోగం చేశాడని ప్రస్తుత నిర్మాత మండలి సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే విశాల్‌తో ఎవరూ పనిచేయొద్దని లేఖ సైతం విడుదల చేశారు. తాజాగా నిర్మాతల మండలి లేఖపై హీరో విశాల్ స్పందించారు. తాను ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని వారు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. కావాలనే తన పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News