ప్రభాస్ ‘కల్కి 2’పై సాలిడ్ అప్‌డేట్.. షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ‘కల్కి 2898ఏడీ’ చిత్రం కొత్త రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే.
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ‘కల్కి 2898ఏడీ’ చిత్రం కొత్త రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే. ఇందులో అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొణె, దిశా పటానీ, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. మైథాలజికల్, సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుని.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ప్రజెంట్ ఓటీటీలో కూడా రిలీజై అక్కడ కూడా అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతుంది.
ఇదిలా ఉంటే.. ఘన విజయం సాధించిన ‘Kalki Part 2కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ‘కల్కి 2’ గురించి ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు కల్కి పార్ట్ 2 షూటింగ్‌పై సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు నిర్మాతలు స్వప్నదత్, ప్రియాంకదత్‌లు. తాజాగా మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్‌లో పాల్గోన్న వీరిద్దరూ.. కల్కి పార్ట్‌కు సంబంధించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. నిర్మాత ప్రియంకా దత్ మాట్లాడుతూ.. ‘కల్కి 2 షూటింగ్ మరో ఆరు నెలల్లో స్టార్ట్ చెయ్యనున్నాం. ఒక్కసారి మూవీ షూటింగ్ స్టార్ట్ అయితే వరుస అప్‌డేట్‌లను ఇస్తాం’ అని తెలిపారు. ఇక స్వప్నదత్ మాట్లాడుతూ.. ‘మొదటి పార్ట్ కంటే కూడా.. పార్ట్ 2 కోసం ఎక్కువగా ఇంట్రెస్ట్‌గా ఉన్నాం. కల్కి నుంచి చాలా నేర్చుకున్నాం. కొత్త ఎనర్జీతో కల్కి 2ను మొదలుపెట్టబోతున్నాం’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రజెంట్ నిర్మాతల కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో.. ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.