ఇలియానాపై పదేళ్ల నిషేధం.. అలా చేయడమే కారణమా?

స్టార్ నటి ఇలియానా సౌత్ ఇండియా సినిమాలకు దూరం కావడానికి బలమైన కారణమే ఉన్నట్లు తెలుస్తోంది.

Update: 2023-02-13 08:59 GMT

దిశ, సినిమా: స్టార్ నటి ఇలియానా సౌత్ ఇండియా సినిమాలకు దూరం కావడానికి బలమైన కారణమే ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు పదేళ్లనుంచి తెలుగు, తమిళ్ చిత్రాలు చేయకుండా కేవలం బాలీవుడ్‌లో పాగా వేయడంపై తాజాగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. విషయానికొస్తే.. రవితేజ 'దేవుడు చేసిన మనుషులు' సినిమా చేసున్న సమయంలోనే కోలీవుడ్‌లో మరో సినిమా చాన్స్ వచ్చిందట ఇలియానాకు. అంతేకాదు ఆ ప్రాజెక్ట్ చేయడానికి నిర్మాత దగ్గర అడ్వాన్స్‌గా రూ. 40 లక్షలు తీసుకుందట.

కానీ, ఈ సినిమా పలు కారణాలతో ఆగిపోవడంతో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగిన ప్రొడ్యూసర్‌ను పెద్దగా లెక్కచేయకపోవడంతోపాటు గట్టిగా అడిగితే అసలు ఇవ్వనని చెప్పిందట. కావాలంటే ఇంకో సినిమా చేస్తా కానీ, డబ్బులు మాత్రం ఇచ్చేది లేదన్నట్లు దురుసుగా ప్రవర్తించిందట. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సదరు నిర్మాత కోలీవుడ్ నడిగర్ సంఘం, సౌత్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఇలియానాపై కంప్లైంట్ చేయడంతో 10ఏళ్ల పాటు సౌత్ సినిమాలు చేయకుండా ఆమెను బ్యాన్ చేశారట.

ఇవి కూడా చదవండి:  నెట్‌ఫ్లిక్స్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన వెంకటేష్.. వీడియో వైరల్ 

Tags:    

Similar News