Super Star Krishna: నింగికేగిన నట శిఖరం..
నటనా వైవిధ్యంతో సూపర్ స్టార్ కృష్ణ కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు.
దిశ, వెబ్ డెస్క్: నటనా వైవిధ్యంతో సూపర్ స్టార్ కృష్ణ కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగు చలన చిత్ర సీమకు అనేక హిట్ సినిమాలను ఆయన అందించారు. కాగా మంగళవారం ఉదయం తీవ్ర అనారోగ్యం కారణంగా మృతి చెందారు. కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి, 1942 మే 31న జన్మించారు. తెలుగు సినిమా నటుడిగా అనేక చిత్రాలతో మెప్పించారు. నిర్మాతగా, దర్శకుడిగా కూడా వ్యవహరించారు. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసిన కృష్ణకు 1964-65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనేమనసులు, మూడవ సినిమా గూఢచారి 116 పరిశ్రమలో నిలదొక్కుకున్నారు. ఆపైన నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్ లో 340 పై చిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించాడు. 1970లో నిర్మాణ సంస్థను ప్రారంభించి పద్మాలయా సంస్థ ద్వారా పలు విజయవంతమైన చిత్రాలు తీశాడు. 1983లో ప్రభుత్వ సహకారంతో పద్మాలయా స్టూడియోను ప్రారంభించారు. కృష్ణ 1970, 1980లో తెలుగు సినిమా హీరోగా అత్యంత ప్రజాదరణ పొంది తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు. దర్శకుడిగాను కృష్ణ 16 సినిమాలు తీశారు.