‘అమ్మమ్మలా’ ఉన్నావంటూ.. అనసూయను హర్ట్ చేసిన నెటిజన్లు..!
బుల్లితెర యాంకర్ అనసూయ గురించి పరిచయం అక్కర్లేదు.
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర యాంకర్ అనసూయ గురించి పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు ఈ గ్లామర్ బ్యూటీ టీవీ షోస్ మానేసి సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తమిళం, మలయాళం సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అనసూయ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. ఆంటీ అన్న పట్టించుకోను, వాళ్లకర్మ వాళ్లకే వదిలేస్తున్నా.. ఇకపై అలాంటి కామెంట్స్‌ను పెద్దగా పట్టించుకోనని గట్టిగానే సమాధానం ఇచ్చారు. అయితే తాజాగా తను మేకప్ లేకుండా, క్లోజప్ షాట్లో తన ఫేస్ వరకే కవర్ అయిన పోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘రెండు నెలల ఆధ్యాత్మికపరమైన వర్కౌట్స్ తర్వాత నా కాన్ఫిడెన్స్ లెవల్ నో ఫిల్టర్ దీంతో నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందంటూ ఫోటో కింద రాసుకొచ్చారు. ఫోటోలను చూసిన ఈ నటి ఫ్యాన్స్ నేచురల్ బ్యూటీ అని, మేకప్ లేకపోయినా చాలా అందంగా ఉన్నావని, అందానికి మారుపేరు అనసూయ అని, లుకింగ్ సో బ్యూటీఫుల్ అని, ఆమెపై ఎంతగానో ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు నెటిజన్లు ‘‘ఫేస్‌పై ముడతలు కనిపిస్తున్నాయని, మేకప్ లేకుండా అమ్మమ్మలా ఉన్నావ్, ఏజ్ ఎక్కువ కనిపిస్తుందని’’ సెటైర్లు వేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also read: సీతపై ఫైర్ అవుతున్న నెటిజన్స్.. బికినీలో రచ్చ రచ్చ..