‘ఖుషి’ సినిమా సమంత స్టోరీనే.. నాగచైతన్యతో విభేదాలు అందుకే వచ్చాయి.. ?
టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో సమంత-నాగచైతన్య ఒకరు.
దిశ, సినిమా: ఒకప్పుడు టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో సమంత-నాగచైతన్య ఒకరు. సినిమా సెట్ నుంచి మొదలైన వీరి స్నేహం, ప్రేమగా మారి 2017లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కానీ, కొన్ని వ్యక్తిగత కారణాలతో అక్టోబర్ 2, 2021న విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఈ వార్త అప్పట్లో సంచలనమైంది. కానీ ఇప్పటి వరకు వీరిద్దరి విడాకులకు అసలు కారణం మాత్రం బయటకు రాలేదు. అయితే తాజాగా విడుదలైన సమంత ‘ఖుషి’ ట్రైలర్‌ను చూస్తే తన జీవితమే కళ్లముందు ప్రత్యక్షమైనట్లు అనిపిస్తుందంటున్నారు నెటిజన్స్.
సమంత నిజజీవితం ఆధారంగానే సినిమా తీశారా అని సందేహిస్తున్నారు. ఎందుకంటే ఈ ట్రైలర్లో పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న విజయ్, సామ్ జాతక దోషం వల్ల గొడవలు పడినట్లు చూపించారు. గతంలో కూడా చైతుకు, సామ్‌కు మధ్య జాతక దోషం వల్లనే విభేదాలు తలెత్తాయని వార్తలు వినిపించాయి. అలాగే సామ్, చై మధ్య జరిగిన అనవసరమైన వాదనలు కూడా విడాకులకు కారణమనే ప్రచారం జరిగింది. ఇక ఈ ‘ఖుషి’ ట్రైలర్లో విజయ్, సమంత మధ్య కూడా అలాంటి గొడవలే కనిపించాయి. అందుకే సమంత లైఫ్‌ను ఈ మూవీలో కళ్లకు కట్టినట్లుగా చూపిస్తున్నారా అని అనుమానిస్తున్నారు నెటిజన్స్.