భారత్ నుంచి ఆస్కార్ బ‌రిలో ‘2018’.. తెలుగు సినిమాల‌కు నిరాశే!

మే 5న విడుదలైన ‘2018’ మూవీ అందరూ చూసే ఉంటారు.

Update: 2023-09-27 11:37 GMT

దిశ, సినిమా: మే 5న విడుదలైన ‘2018’ మూవీ అందరూ చూసే ఉంటారు. 2018లో కేరళలో ముంచుకొచ్చిన వరదల కారణంగా అక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనేది ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇక అన్ని భాషల్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రం రూ.200 కోట్లకుపైగా వ‌సూళ్లను రాబ‌ట్టి మ‌ల‌యాళ సినీ చ‌రిత్రలోనే అత్యధిక క‌లెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. విషయమేమిటంటే.. ‘2018’ మూవీ ఆస్కార్‌ రేసులో నిలిచింది. ఆస్కార్‌ 2024 కోసం ఇండియా నుంచి అఫీషియ‌ల్ ఎంట్రీని ద‌క్కించుకున్నది. 96వ ఆస్కార్స్‌లో బెస్ట్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిల్మ్ కేట‌గిరీలో ఈ సినిమా పోటీప‌డ‌నుంది. ఇక ఫైన‌ల్ నామినేష‌న్స్‌లో ఈ మూవీకి చోటు ద‌క్కే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Similar News