మోజుపడి.. రెండో పెళ్లి చేసుకుంటానని.. మంచు మనోజ్‌ను టార్చర్ చేసిన హీరోయిన్..
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ మూవీస్ వచ్చి చాలా కాలమైంది.
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ మూవీస్ వచ్చి చాలా కాలమైంది. హీరోగా పలు చిత్రాల్లో నటించినప్పటికీ కరెక్ట్ హిట్ కొట్టలేదు. కానీ నటనాపరంగా మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా ప్రజంట్ ఓ ప్రోగ్రాం ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. ఇకపోతే ఆయనకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మంచు మనోజ్‌కు పెళ్లైందని తెలిసి కూడా ఓ హీరోయిన్ మళ్లీ పెళ్లి చేసుకుంటానని చాలా ఇబ్బంది పెట్టిందట. కానీ మనోజ్ స్పందించకుండా దూరం పెట్టాడట. కానీ సదరు హీరోయిన్ మాత్రం ‘నువ్వు రెండు పెళ్లిళ్లు చేసుకున్నా నిన్ను నేను ప్రేమిస్తూనే ఉంటాను’ అంటూ మొండిగా మాట్లాడిందట. ఇక ఈ విషయం కాస్త మోహన్ బాబు చెవిన పడటంతో.. ‘నా కొడుకుని ఇంకోసారి ఇబ్బంది పెడితే మాత్రం నీకు ఇండస్ట్రీలో లైఫ్ ఉండకుండా చేస్తా’ అని గట్టి వార్నింగ్ ఇచ్చాడట.