ఘనంగా జరిగిన వెంకటేష్ రెండవ కూతురు నిశ్చితార్థం

తెలుగు సినిమా ఇండస్ర్టీ‌లో దగ్గుబాటి కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2023-10-26 07:10 GMT

దిశ, సినిమా: తెలుగు సినిమా ఇండస్ర్టీ‌లో దగ్గుబాటి కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి హీరో మంచి సక్సెస్ అందుకున్నాడు. వీరిలో ముందుగా మనకు గుర్తుకు వచ్చే హీరో వెంకటేష్. అయితే వెంకటేష్‌కు ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారనే సంగతి తెలిసిందే. కాగా తన పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం అప్పట్లో ఎంతో ఘనంగా చేయగా, ఇప్పుడు రెండో కుమార్తె హయవాహిని మ్యారేజ్ కూడా సెట్ అయింది. తాజాగా ఆమె ఎంగేజ్‌మెంట్ కూడా జరిగినట్లు తెలుస్తుండగా ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Tags:    

Similar News