వారికి క్షమాపణలు చెప్తూ లేఖ రాసిన ‘Adipurush’ చిత్ర యూనిట్

స్టార్ హీరో ప్రభాస్, డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషనల్‌లో వచ్చిన చిత్రం ‘ఆదిపురుష్’.

Update: 2023-06-20 03:43 GMT

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరో ప్రభాస్, డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషనల్‌లో వచ్చిన చిత్రం ‘ఆదిపురుష్’. అయితే ఈ సినిమా జూన్ 16న విడుదలైన మొదటి షో నుంచే పలు వివాదాలను ఎదుర్కొంటుంది. అంతేకాకుండా రామాయణాన్ని అవమానించారని హిందూ సంఘాలు కోర్టులో పిటిషన్ కూడా వేశారు. అయితే ఈ మూవీలో సీత భారత్‌లో పుట్టినట్లు చూపించగా.. దీనిపై నేపాల్ సెన్సార్ బోర్డ్ అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మేయర్ కాఠ్‌మండూ ఆ దేశ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డైలాగ్ తీసేయకుంటే భారత సినిమాలు తమ దేశంలో అనుమతించమని హెచ్చరించారు. తాజాగా, దీనిపై ఆదిపురుష్ చిత్ర యూనిట్ స్పందించింది. నేపాల్’లోని కాఠ్‌మండూ మేయర్‌కు, సెన్సార్ బోర్డులకు T సిరీస్, యూవీ క్రియేషన్స్ క్షమాపణలు చెబుతూ లేఖ రాశారు.

Also Read: ఆదిపురుష్ సినిమా ఓ భయానకమైన జోక్.. నటుడు షాకింగ్ కామెంట్స్..

రాకేష్ మాస్టర్ మృతిపై ఆయన కూతరు షాకింగ్ కామెంట్స్?



Tags:    

Similar News