నా తమ్ముడు జెమ్ అండి జెమ్.. చిరు - రజనీకాంత్ మధ్య కన్వర్జేషన్ వైరల్

ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో ఆయన కుటుంబం ఆనందం గురించి ఎంత చెప్పినా తక్కువే. మరీ ముఖ్యంగా

Update: 2024-06-12 09:57 GMT

దిశ, సినిమా : ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో ఆయన కుటుంబం ఆనందం గురించి ఎంత చెప్పినా తక్కువే. మరీ ముఖ్యంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు చిరు తన తమ్ముడి గెలుపు చూసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. అయితే ఈరోజు(బుధవారం) నాలుగోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

అయితే ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్, రాజకీయ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. ఇక పవన్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే చిరంజీవి ఆనందం మాటలో చెప్పలేనిది, ఆయన పవన్ అనే నేను అని మొదలు పెట్టినప్పటి నుంచి ప్రమాణ స్వీకారం అయిపోయే వరకు చిరు తన తమ్ముడినే ఆనందంగా చూస్తూ ఉండిపోయారు. అయితే ఆయన మధ్యలో రజినీకాంత్‌తో సంభాషించారు. ప్రస్తుతం దీనిని కొందరు మీమర్స్ .. అన్నయ్య మూవీ డైలాగ్‌తో మీమ్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇవి తెగ ట్రెండ్ అవుతున్నాయి.

అయితే చిరంజీవి హీరోగా, సౌందర్య హీరోయిన్‌గా రవితేజ, మరో హీరో చిరు బ్రదర్స్‌గా వచ్చిన సినిమా అన్యయ్య. ఇందులో చిరు తన తమ్ముళ్ల గురించి పొగుడుతూ.. మా తమ్ముళ్లు జెమ్స్ అండి జెమ్స్ అని చెప్పుకొస్తారు. అయితే పవన్ ప్రమాణ స్వీకారం వేళ.. రజినీకాంత్‌కు చిరు మా తమ్ముడి జెమ్ అండి జెమ్ అని చెప్తుంటే, రజినీకాంత్ ఇప్పటికే 100 సార్లు చెప్పావు అంటూ మీమ్ వచ్చింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


Similar News