సూర్యుడినే మాయం చేస్తోన్న బ్యూటీ..గులాబీ అందంలో మతి పోగొట్టేసిందిగా!?

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మ ఓ సెన్సేషన్‌. ఈ బ్యూటీ మూవీల్లో నటించింది తక్కువే అయినా పాపులారిటీని మాత్రం ఓ రేంజ్‌లో సొంతం చేసుకుంది.

Update: 2024-08-28 05:12 GMT

దిశ,వెబ్‌డెస్క్:బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మ ఓ సెన్సేషన్‌. ఈ బ్యూటీ మూవీల్లో నటించింది తక్కువే అయినా పాపులారిటీని మాత్రం ఓ రేంజ్‌లో సొంతం చేసుకుంది. ఇక ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు తన ఫొటోస్ షేర్ చేస్తూ నెట్టింట సెగలు పుట్టిస్తోంది. హీటెక్కించే ఫోజులతో కుర్రకారు మతిపోగొట్టేసింది. అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా చీరకట్టులో నైనా లేదా మోడ్రన్ డ్రెస్సులలోనైనా ఈ అందాల ముద్దుగుమ్మ కుర్రకారు హృదయాలను దోచుకుంటుంది. ఇంతకీ ఆ అందాలరాశి ఎవరు? అని ఆలోచిస్తున్నారా! సూర్యుడినే మాయం చేస్తూ గులాబీ అందంలో గుబాలిస్తోన్న ఈ అమ్మడు షామా సికిందర్. బాలీవుడ్ సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు.

ట్రెండ్‌ను సెట్ చేసేలా ఈ మధ్య కాలంలో నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. బుల్లితెరపై యే మేరీ లైఫ్ హై, స్లేవ్ ఆఫ్ హర్ డిజైర్స్ వంటి షోలతో గుర్తింపు తెచ్చుకుంది. అమీర్ ఖాన్ నటించిన మాన్ మూవీతో తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత హిందీలో అనేక చిత్రాల్లో నటించి అలరించింది. తాజాగా ఈ బ్యూటీ  ఇన్ స్టాలో షేర్ చేసిన ఫొటోలలో ఫోజులకు నెటిజన్స్ ఫిదా అవ్వాల్సిందే. వేకువజామునే తొలి సూర్య కిరణాలు నా సొంతం అంటూ అందమైన లోకేషన్‌లో కెమెరాలకు హీట్ పుట్టించే ఫోజులిచ్చింది. పింక్ కలర్ దుస్తులపై మ్యాచింగ్ యాక్ససరీస్‌తో అమ్మాడి అలంకరణ ప్రతీది షామిని మరింత అందంగా కనిపించేలా చేశాయి. సోనోరిటా అంటూ ఓహిందీ పాటను షేర్ చేసింది. ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.


Similar News