Bigg Boss 8: బిగ్ బాస్ సీజన్ 8 మొదలవ్వకముందే టైటిల్ విన్నర్ ని చెప్పేసిన ప్రేక్షకులు.. ఆమె ఎవరంటే?

బిగ్ బాస్ సీజన్ 8 మొదలవ్వకముందే టైటిల్ విన్నర్ ని చెప్పేసిన ప్రేక్షకులు

Update: 2024-07-25 12:28 GMT

దిశ, సినిమా: బిగ్ బాస్ రియాలిటీ షోకి అభిమానులు చాలా మందే ఉన్నారు. ఎందుకంటే ఈ షో ని ప్రశంసించే వాళ్ళు ఉన్నారు అలాగే విమర్శించే వాళ్ళు ఉన్నారు. గత కొద్దీ రోజుల నుంచి బిగ్ బాస్ సీజన్ 8 గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అదేంటో ఇక్కడ చూద్దాం..

కుమారి ఆంటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద రెస్టారెంట్ వారికీ కూడా రాని పేరు ఈమెకి ఒక్క రోజులోనే వచ్చింది. ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఓపెన్ చేసిన ఈ ఆంటీ పేరే వినబడింది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టీవీ షో స్ వరకు వెళ్ళింది. ఈ మధ్య పలు యూట్యూబ్‌ ఛానెల్స్ కూడా ఇంటర్వ్యూలు ఇస్తుంది. రోడ్ పక్కన చిన్న వ్యాపారం పెట్టుకుని సక్సెస్ అయినా కుమారి ఆంటీకని బిగ్ బాస్ లోకి తీసుకురావాలని చాలా ట్రై చేస్తున్నారని తెలుస్తుంది.

అయితే, ఈ వార్త బిగ్ బాస్ ప్రేక్షకులకు తెలియడంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫొటోతో ఎంట్రీ ఇవ్వండి. మిమ్మల్ని మేము గెలిపిస్తాము. మీ వెనుక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం ఉంటారు. టైటిల్ కూడా మీరే కొడతారంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Tags:    

Similar News