Bigg Boss 8: బిగ్‎బాస్‏కు హ్యాండ్ ఇచ్చిన ఆ నటుడు.. అతనెవరంటే..?

బిగ్‎బాస్‏కు హ్యాండ్ ఇచ్చిన ఆ నటుడు..

Update: 2024-09-02 03:25 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఆదివారం గ్రాండుగా లాంచ్ చేసారు. ఈ సీజన్ మిగతా సీజన్ల కంటే కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. ఎందుకంటే ఈ సారి కొత్త కాన్సెప్ట్ తో మన ముందుకొచ్చారు. అలాగే దీనిలో ఊహించలేని ట్విస్ట్‌లు చాలానే ఉన్నట్టు అర్ధమవుతుంది. ప్రతీ సారి సోలోగా ఇంట్లోకి వెళ్ళేవాళ్ళు.. కానీ, ఈ సారి జంటలుగా వెళ్ళారు. మొత్తం 14 మంది బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టారు. వారిలో ఏడుగురు అమ్మాయిలు.. ఏడుగురు అబ్బాయిలు ఉన్నారు. అయితే,‏ చివరి నిమిషంలో ఓ కంటెస్టెంట్ బిగ్ బాస్ లోకి వెళ్ళకుండా ఆగిపోయాడని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతనెవరో ఇక్కడ చూద్దాం..

14 మందిలో నటుడు పరమేశ్వర్ హివ్రాలే కూడా ఉన్నారని తెలిసిన సమాచారం. అతను సినిమాల్లోకి అడుగుపెట్టి ఏళ్ళు అవుతున్నా సరైన గుర్తింపు రాలేదు. బిగ్ బాస్ అతనికి ఆఫర్ చేసింది. అయితే, ఆయన ఆరోగ్యం అతనికి సహారించకపోవడంతో బిగ్‎బాస్‏ షో మొదలవ్వక ముందే చివరిలో ఈ విషయం చెప్పి ఆగిపోయాడని సమాచారం. ఇక అతడి స్థానంలో ఎవరో ఒకర్ని ఒకర్ని భర్తీ చేయాలని యూట్యూబర్ నబీల్ అఫ్రిది కి అవకాశం ఇచ్చారు. మరి, ఈ యూట్యూబర్ వచ్చిన లక్కీ ఛాన్స్ ను ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి!

Tags:    

Similar News