డేటింగ్ యాప్‌లో సెలబ్రిటీలు చేసే పని అదే.. అసలు విషయం బయటపెట్టిన ఊర్వశీ రౌతేలా!

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా పలు సినిమల్లో ఐటమ్ సాంగ్‌తో అదిరిపోయే స్టెప్పులేసి భారీ పాపులారిటీ సంపాదించుకుంది.

Update: 2024-09-27 10:03 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా పలు సినిమల్లో ఐటమ్ సాంగ్‌తో అదిరిపోయే స్టెప్పులేసి భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలు షేర్ చేసి కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది. ప్రజెంట్ ఊర్వశీ బాలయ్య ‘ఎన్‌బీకే 109’ సినిమాలో నటిస్తోంది. ఇటీవల ఈ విషయంపై రియార్ట్ అవుతూ బాలయ్యపై ప్రశంసలు కురిపించింది.

ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఊర్వశీ డేటింగ్ గురించి పలు విషయాలు తెలిపింది. ‘‘ఆ డేటింగ్ యాప్‌లో హృతిక్ రోషన్, ఆదిత్యారాయ్‌లతో పాటు చాలామంది పేర్లు కూడా ఉన్నాయి. మేము అందులో మాట్లాడుకోవడం కోసం లాగిన్ అయ్యాము. దాన్ని మరో కోణంలో చూడకండి. మేము ఖాళీ సమయంలో డేటింగ్ యాప్‌లో మాట్లాడుకుంటూ ఉంటాం. ఒకరి ఒకరం రిక్వెస్ట్ పెట్టుకుంటుంటాం అంతే’’ అని చెప్పుకొచ్చింది.


Similar News