ఆ జర్నలిస్ట్ అసభ్యకరమైన వ్యక్తి.. ఆయనతో అసంతృప్తే.. హీరోయిన్ కామెంట్స్ వైరల్

ఉమర్ సింధూ.. ఈ పేరు వినే ఉంటారు. తనకు తాను స్వయం ప్రకటిత రివ్యూ రైటర్‌గా చెప్పుకునే ఇతడు సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటాడు.

Update: 2023-04-23 09:02 GMT
ఆ జర్నలిస్ట్ అసభ్యకరమైన వ్యక్తి.. ఆయనతో అసంతృప్తే.. హీరోయిన్ కామెంట్స్ వైరల్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఉమైర్ సంధు.. ఈ పేరు వినే ఉంటారు. తనకు తాను స్వయం ప్రకటిత రివ్యూ రైటర్‌గా చెప్పుకునే ఇతడు సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటాడు. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన తారల పర్సనల్ విషయాలను చర్చిస్తూ ట్విట్టర్ వేదికగా న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా.. ఉమైర్ సంధు చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. అక్కినేని అఖిల్ బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌలాలాని హెరాస్ చేశాడంటూ అతడు పెట్టిన ఓ ట్వీట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ ట్వీట్‌పై ఊర్వశీ రౌతాలా స్పందించారు.

‘‘తనపై ఇలాంటి అసభ్యకరమైన ట్వీట్స్ చేస్తున్న వారిపై లీగల్ టీమ్ ద్వారా పరువు నష్టం చట్టపరమైన నోటీసు అందించబడింది. మీలాంటి అసభ్యకరమైన జర్నలిస్టుల వల్ల అసంతృప్తిగా ఉందని పేర్కొంది. మీరు నా అధికారిక ప్రతినిధి కాదు. మీలాంటి మెచ్యూరిటీ లేని వ్యక్తుల ట్వీట్స్ కారణంగా మా కుటుంబం, నేను అసౌకర్యంగా ఫీల్ అవుతున్నాం’’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ ట్వీట్‌లో ఉమర్ సింధూ పేరు ప్రస్తావించలేదు. కానీ,, అతడు పెట్టిన ట్వీట్‌పై ఫేక్ అంటూ ఊర్వశీ రిట్వీట్ చేసింది.

Full View

Also Read..

ఆయన సెట్‌లోనే దారుణంగా తిట్టేవాడు.. ఏమీ చేయలేక ఏడ్చేదాన్ని  

Tags:    

Similar News