ఆ హీరోయిన్ బాయ్‌ఫ్రెండ్ నన్ను కొట్టాడు.. డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్
బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
దిశ, సినిమా: బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఓ హీరోయిన్‌కు మూవీ స్క్రిప్ట్ పంపితే ఆమె బాయ్‌ఫ్రెండ్ కొట్టాడని తెలిపారు. ‘‘దేవదాస్ (బుక్)లో ఉండే లవ్ స్టోరీ భారతీయులకు బాగా నచ్చుతుంది. నా దృష్టిలో అది అంత ఏం బాగుండదు. ఈ స్టోరీ బేస్ చేసుకుని ఏకంగా 20 చిత్రాలు వచ్చాయి. ఈ పుస్తకాన్ని రాసిన రచయిత పర్సనల్ స్టోరీ బాగుంటుందని కొన్ని విషయాలు జోడింది ‘దేవ్ డి’ పేరుతో కథ రెడీ చేశాను. అయితే ఇందులో ఇద్దరు హీరోయిన్స్ అయితే భాగుంటుందని భావించాను.
దీంతో భాష విషయంలో ఎలాంటి కండిషన్లు పెట్టలేదు. కొందరికి స్క్రిప్ట్ చదివాక ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఆడిషన్స్‌కు రాలేదు. ఈ క్రమంలో ఓ హీరోయిన్‌కు స్టోరీ పంపితే ఆ విషయం ఆమె బాయ్‌ఫ్రెండ్‌కి తెలిసి నన్ను కొట్టాడు. ‘నీకు ఎంత ధైర్యం ఉంటే నా గర్ల్‌ఫ్రెండ్‌కు పంపుతావ్’ అని హెచ్చరించాడు. ఓ నిర్మాత కూడా స్టోరీ చెత్తగా ఉందని మొహం మీద చెప్పారు. కానీ అతని భార్యకు నచ్చడంతో మూవీ చేశాం’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ అనురాగ్ కశ్యప్ కామెంట్స్ వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు షాక్ అవుతున్నారు.